logo

కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం

సాగు చేస్తున్న భూమిని పలువురు కబ్జా చేసుకున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కరించట్లేదంటూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని ఆచన్‌పల్లికి చెందిన కుటుంబం సోమవారం కలెక్టరేట్‌

Published : 18 Jan 2022 03:31 IST

న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సాగు చేస్తున్న భూమిని పలువురు కబ్జా చేసుకున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కరించట్లేదంటూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని ఆచన్‌పల్లికి చెందిన కుటుంబం సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. మల్లీశ్వరి, రాణి(అక్కాచెల్లెళ్లు), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ లోపలికి వెళ్తుండగా మల్లీశ్వరి, రాణి వారితో తెచ్చుకున్న పెట్రోల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ అడ్డుకున్నారు. వారి నుంచి పెట్రోల్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

బాధితులు ఏముంటున్నారంటే.. ఆచన్‌పల్లి శివారులో రెండెకరాల భూమిని మల్లీశ్వరి, రాణి వాళ్ల నాన్న చిన్న నర్సయ్య 1992లో బంటు పోశవ్వ, బంటు బాబయ్య, నీరడి కన్నయ్య, మర్రెడి రాంరెడ్డి నుంచి కొనుగోలు చేసి ఇచ్చారు. అప్పటి నుంచి వీరే సాగు చేసుకుంటున్నారు. కానీ భూమి విక్రయించిన వారు తాము అమ్మట్లేదని చెబుతూ పొలంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. కొత్త పాస్‌ పుస్తకాలు కూడా అమ్మిన వారి పేర్లతో జారీ చేశారన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. భూమి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టర్‌ బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని