logo

మత్తు వైద్యుడు సహా.. మరో 12 మందికి

ఆర్మూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్యుడికి కరోనా నిర్ధారణైంది. ఆయన నిత్యం నిజామాబాద్‌ నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తారని, సోమవారం స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు

Published : 18 Jan 2022 03:31 IST

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్యుడికి కరోనా నిర్ధారణైంది. ఆయన నిత్యం నిజామాబాద్‌ నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తారని, సోమవారం స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో శస్త్రచికిత్స ప్రసవాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో ఆరురోజుల కిందట ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక హెల్ప్‌ డెస్క్‌ ఉద్యోగి కొవిడ్‌ బారినపడిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో ఒక వైద్యునికి, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా రావడంతో ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 46 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌ నిర్ధారణైందని సూపరింటెండెంట్‌ నాగరాజు తెలిపారు. మూడ్రోజుల వ్యవధిలోనే 24 మందికి కొవిడ్‌ సోకడం గమనార్హం.
రెంజల్‌లో ముగ్గురికి : రెంజల్‌: మండలకేంద్రంలోని పీహెచ్‌సీ పరిధిలో సోమవారం 32 కొవిడ్‌ పరీక్షలు చేయగా.. ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వారిని హోంఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆరోగ్య సిబ్బంది సూచించారు.
నవీపేటలో నలుగురికి... : నవీపేట: మండలకేంద్రంలోని సీహెచ్‌సీలో సోమవారం 18 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పర్యవేక్షకులు కిషన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని