logo

ప్రభుత్వ బడులకు దయానందుడు

ప్రభుత్వ బడులు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్‌రెడ్డి  తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.48 లక్షలు వెచ్చించారు. మరమ్మతులు,

Published : 18 Jan 2022 03:31 IST

రూ.48 లక్షలతో మౌలిక వసతుల కల్పన
న్యూస్‌టుడే, ఆర్మూర్‌ గ్రామీణం

పెర్కిట్‌ ఉన్నత పాఠశాలకు అందజేసిన డ్యూయెల్‌ డెస్క్‌ బెంచీలతో ప్రధానోపాధ్యాయుడు సీతయ్య, ఉపాధ్యాయులు

ప్రభుత్వ బడులు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్‌రెడ్డి  తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.48 లక్షలు వెచ్చించారు. మరమ్మతులు, విద్యుత్తు తీగల ఏర్పాటు,  రంగులు వేయించడం చేశారు. సైన్స్‌ ల్యాబ్‌లు నెలకొల్పారు. డెస్క్‌ బల్లలు అందించి విద్యార్థులు చక్కగా పాఠాలు వినేందుకు సౌకర్యం కల్పించారు.

ఏడాది కాలంలో అందజేసినవి
పెర్కిట్‌ ఉన్నత పాఠశాలకు రూ. 1.50 లక్షల విలువైన 50 డెస్క్‌ బల్లలు అందజేశారు.
ఆర్మూర్‌ కేజీబీవీ జూనియర్‌ కళాశాలకు అప్‌గ్రేడ్‌ కావడంతో బెంచీల కొరత తీర్చేందుకు రూ.75 వేల విలువైన 25 బల్లలు ఇచ్చారు. ః పెర్కిట్‌, కోమన్‌పల్లి, బాల్కొండ, ముప్కాల్‌, వేల్పూర్‌, మోతె, కోటగిరి ఉన్నత పాఠశాలల్లో రూ.2 లక్షలతో సైన్స్‌ ల్యాబ్‌లు నెలకొల్పారు.  ః వేల్పూర్‌ ఉన్నత పాఠశాలకు రూ.3 లక్షలు వెచ్చించి 100, పచ్చలనడ్కుడ ఉన్నత పాఠశాలకు రూ.1.50 లక్షల విలువైన 50 బల్లలు అందజేశారు.  ః కమ్మర్‌పల్లి కేజీబీవీ కళాశాలకు రూ. 1.50 లక్షలు వెచ్చించి 50, చౌట్‌పల్లి ఉన్నత పాఠశాలకు 50 బల్లలు ఇచ్చారు.

పాఠశాలల అభివృద్ధికి చర్యలు
తనకు విద్యాబుద్ధులు నేర్పిన పెర్కిట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాల సముదాయంలో 24 తరగతి గదులకు రూ.4.50 లక్షలు వెచ్చించి మరమ్మతులు, విద్యుత్తు వైరింగ్‌ పనులు, రంగులు వేయించారు.
రూ.10 లక్షలతో బాల్కొండ ఉన్నత పాఠశాలలో విద్యుత్తు లైనింగ్‌, మరమ్మతులు, గదులకు రంగులు వేయించారు. రూ.3 లక్షలు వెచ్చించి 100 బల్లలు    అందజేశారు.
రూ.8 లక్షలు వెచ్చించి చిట్టాపూర్‌ , కోమన్‌పల్లి ఉన్నత పాఠశాలలకు రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దారు.


పేద విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దని
- దయానంద్‌రెడ్డి, పారిశ్రామికవేత్త

సర్కారు బడిలో చదువుకొని ఈ స్థాయికి ఎదిగాను. పేద విద్యార్థుల చదువుకు ఇబ్బందులు తలెత్తొద్దని ప్రభుత్వ బడుల్లో వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు నావంతు సాయం అందిస్తా.


అడిగిన వెంటనే స్పందిస్తున్నారు
- సీతయ్య, డీసీఈబీ కార్యదర్శి, పెర్కిట్‌ ప్రధానోపాధ్యాయుడు

దయానంద్‌రెడ్డి బాల్కొండ, పెర్కిట్‌ ఉన్నత పాఠశాలల పూర్వ విద్యార్థి. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న బడుల్లో సరైన బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లిన వెంటనే వసతుల కల్పనకు స్పందిస్తున్నారు. పదుల సంఖ్యలో బడులను బాగు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని