logo

పోక్సోకోర్టులో విశ్రాంతి గది

పోక్సోకోర్టులో బాధిత పిల్లల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని జిల్లా జడ్జి కుంచాల సునీత సోమవారం ప్రారంభించారు. పోక్సో ప్రత్యేక చట్టంలో పేర్కొన్న విధంగా అన్ని వసతులు కల్పించారు. పోక్సోకోర్టు జడ్జి

Published : 18 Jan 2022 03:31 IST

రిబ్బన్‌ కత్తిరిస్తున్న జిల్లా జడ్జి కుంచాల సునీత

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: పోక్సోకోర్టులో బాధిత పిల్లల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని జిల్లా జడ్జి కుంచాల సునీత సోమవారం ప్రారంభించారు. పోక్సో ప్రత్యేక చట్టంలో పేర్కొన్న విధంగా అన్ని వసతులు కల్పించారు. పోక్సోకోర్టు జడ్జి పంచాక్షరి, జిల్లాకోర్టు పి.పి.రవిరాజ్‌, పోక్సోకోర్టు పి.పి.వసంత్‌, ప్రభుత్వ ప్లీడర్‌ ఈగ గంగారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్‌, జిల్లాకోర్టు మాజీ పి.పి మధుసూదన్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
వర్చువల్‌ విధానంలో నిర్వహణ
నిజామాబాద్‌ న్యాయవిభాగం: కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో మంగళవారం నుంచి ఫిబ్రవరి 4 వరకు వర్చువల్‌ విధానంలో కోర్టులు నిర్వహించాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కక్షిదారులు వారి న్యాయవాదులను సంప్రదించి కేసులు తెలుసుకోవాల్సి ఉంటుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మాదస్తు రాజారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని