logo

పాఠశాలలు వెంటనే తెరవాలి

పాఠశాలలను వెంటనే తెరవాలని ట్రస్మా ప్రతినిధులు డీఈవో రాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. మార్కెట్లు, సినిమాహాళ్లు, బార్లు, వైన్స్‌లు, షాపింగ్‌మాళ్లు, రాజకీయ సమావేశాలతోనే కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు.

Published : 18 Jan 2022 03:31 IST

కామారెడ్డి కలెక్టరేట్‌ : పాఠశాలలను వెంటనే తెరవాలని ట్రస్మా ప్రతినిధులు డీఈవో రాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. మార్కెట్లు, సినిమాహాళ్లు, బార్లు, వైన్స్‌లు, షాపింగ్‌మాళ్లు, రాజకీయ సమావేశాలతోనే కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు. వాటికి ఎలాంటి ఆంక్షలు విధించకుండా.. అన్ని జాగ్రత్తలతో కొనసాగిస్తున్న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం విడ్దూరంగా ఉందన్నారు. వెంటనే పాఠశాలలను తెరవాలని డిమాండ్‌ చేశారు. ట్రస్మా రాష్ట్ర సహ అధ్యక్షుడు ఉప్పునూతుల నాగరాజ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దిన్‌, ప్రధాన కార్యదర్శి పున్న రాజేశ్‌, కోశాధికారి శరత్‌చంద్ర, రాజు, భాస్కర్‌, రమేశ్‌శర్మ, చారి, రాములు, సురేశ్‌ పాల్గొన్నారు.

డీఈవో రాజుకు వినతిపత్రం అందజేస్తున్న ట్రస్మా ప్రతినిధులు


విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు


కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఓటర్ల దినోత్సవం రోజున కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని మండలాధికారులకు జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పోటీలు చేపట్టాలన్నారు.  విజేతలకు కళాశాల స్థాయిలో బహుమతులు ప్రదానం చేయాలన్నారు. కొత్త ఓటర్లకు కిట్లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవో శ్రీను, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సాయిభుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని