logo

గుట్కా, మట్కాపై ఉక్కుపాదం

కమిషనరేట్‌లో గుట్కా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీపీ కె.ఆర్‌.నాగరాజు ఆదేశించారు. మట్కా, పేకాట అడ్డాలపై నిఘా ఉంచాలని సూచించారు. డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీలతో బుధవారం ఆయన నెలవారీ నేర సమీక్ష

Published : 20 Jan 2022 02:40 IST

ప్రసంగిస్తున్న సీపీ నాగరాజు, చిత్రంలో డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీలు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కమిషనరేట్‌లో గుట్కా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీపీ కె.ఆర్‌.నాగరాజు ఆదేశించారు. మట్కా, పేకాట అడ్డాలపై నిఘా ఉంచాలని సూచించారు. డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీలతో బుధవారం ఆయన నెలవారీ నేర సమీక్ష జరిపారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన మొదటి సమీక్షలోనే సీఐలు, ఎస్‌హెచ్‌వోలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి అధికారి పనితీరును పరిశీలిస్తానని, వాటి ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు. బదిలీపై వెళ్తున్న వారు కొత్తగా వచ్చే వారికి కేసులపై అవగాహన కల్పించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని