logo

16 కి.మీ.. నిత్యం ప్రమాదాలు

16 కి.మీ ఉన్న నిజామాబాద్‌-డిచ్‌పల్లి రహదారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించినా ప్రమాదాలు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో రోడ్డు భద్రత జిల్లా కమిటీ నివారణ చర్యలు చేపట్టింది. కమిటీ ఛైర్మన్‌ పాలనాధికారి

Published : 20 Jan 2022 02:40 IST

న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నేరవార్తలు

డిచ్‌పల్లి రోడ్డును పరిశీలిస్తున్న కమిటీ ప్రతినిధులు

16 కి.మీ ఉన్న నిజామాబాద్‌-డిచ్‌పల్లి రహదారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించినా ప్రమాదాలు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో రోడ్డు భద్రత జిల్లా కమిటీ నివారణ చర్యలు చేపట్టింది. కమిటీ ఛైర్మన్‌ పాలనాధికారి నారాయణరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ సీపీ నాగరాజు నిర్ణయం మేరకు ఆర్‌అండ్‌బి ఈఈ రాంబాబు, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, డీఈ ప్రవీణ్‌ కుమార్‌, సీఐ రఘునాథ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కమిటీ సభ్యులు రహదారిని పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను నివేదిక రూపంలో తయారుచేశారు.
వాహనదారుల  నిర్లక్ష్యమే..
* ఈ మార్గంలో వరుస ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతివేగం, తప్పుడు మార్గంలో ప్రయాణం, డివైడర్ల వద్ద ఇష్టారాజ్యంగా రోడ్లు దాటడం వంటివి చేస్తున్నారు. 

* పెట్రోల్‌ బంకులు, ఇనిస్టిట్యూట్‌లు ఉన్న చోట డివైడర్లను ప్రత్యేకంగా తెరిచారు. వీటి వద్ద వాహనదారులు ఒక్కసారిగా వాహనాలను మలుపుతుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది.

* గతంతో పోలిస్తే రోడ్డు మెరుగుపడినా ఇప్పటికీ రాత్రివేళ పలు చోట్ల వీధి దీపాల వ్యవస్థ లేదు. ఇటీవల సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసినా ఇంకా ప్రారంభించలేదు. సత్వరమే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సూచించింది.

* 16 కి.మీ. దారిలో రోడ్డుకు ఇరువైపులా ఐదారు గ్రామాలకు వెళ్లేందుకు అనుసంధాన రహదారులు ఉన్నాయి. ఆయా మార్గాల నుంచి వాహనదారులు రోడ్డుపైకి వేగంగా వస్తున్నారు. 

* ధర్మారంలో ఓ మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని