logo

సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త వేగవంతం చేయాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. లింగంపేటలో బుధవారం నియోజకవర్గ బూత్‌స్థాయి సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 30 వేల

Published : 20 Jan 2022 02:40 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, పక్కన జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌

లింగంపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త వేగవంతం చేయాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. లింగంపేటలో బుధవారం నియోజకవర్గ బూత్‌స్థాయి సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 30 వేల సభ్యత్వాలు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 7 వేలు చేయించినట్లు తెలిపారు. 200 పైబడి సభ్యత్వం చేసిన కార్యకర్తలను సన్మానించారు. 500 సభ్యత్వం చేయించిన వారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చరవాణిలో మాట్లాడిస్తానన్నారు. మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ఈర్షద్‌ కాంగ్రెస్‌లో చేరారు. లింగంపేట మండలాధ్యక్షుడు షరీఫ్‌ వేదిక పైకి అందరిని పిలిచి మాజీ జిల్లా అధ్యక్షురాలు జమునారాఠోడ్‌, డా.వెంకట్‌ను పిలవకపోవడంతో వారి వర్గీయులు నిరసన తెలిపారు. గందరగోళం నెలకొనడంతో షబ్బీర్‌అలీ కల్పించుకొని డా.వెంకట్‌ను వేదికపైకి పిలిచారు. పార్టీ కోసం అందరూ కష్టపడాలని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవీగౌడ్‌, మధన్‌మోహన్‌రావు, ఒడ్డెపల్లి సుభాష్‌రెడ్డి,   రమేశ్‌  ముదిరాజ్‌, మహేందర్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని