logo

కేసుల నమోదు నాన్చొద్దు

కేసుల నమోదులో నాన్చుడు ధోరణి వద్దని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులోనూ తాత్సారం పనికిరాదని సూచించారు. కోర్టులో

Published : 20 Jan 2022 02:40 IST

ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కేసుల నమోదులో నాన్చుడు ధోరణి వద్దని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులోనూ తాత్సారం పనికిరాదని సూచించారు. కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది మొదలు ట్రయల్‌ పూర్తయ్యే వరకు బాధ్యతవహించాలన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. దొంగతనాల నివారణకు ఆయా పోలీసుస్టేషన్ల వారీగా బీట్లు పెంచి పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉందన్నారు. రహదారి ప్రమాదాలు కట్టడి చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు ఆయా ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని