logo

గొలుసు దుకాణాలపై దాడులు

జిల్లాలోని పలు గ్రామాల్లో గొలుసు దుకాణాల ఏర్పాటుపై ‘ఈనాడు’లో ఈ నెల 19న ప్రచురితమైన ‘గొలుసుపై అలుసు’ కథనంపై అధికారులు స్పందించారు. ఆబ్కారీ ఈఎస్‌ ఆదేశాలతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సదాశివనగర్‌, మాచారెడ్డి

Published : 20 Jan 2022 02:40 IST

మద్యం స్వాధీనం చేస్తున్న ఆబ్కారీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై మమత, సిబ్బంది

దోమకొండ, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు గ్రామాల్లో గొలుసు దుకాణాల ఏర్పాటుపై ‘ఈనాడు’లో ఈ నెల 19న ప్రచురితమైన ‘గొలుసుపై అలుసు’ కథనంపై అధికారులు స్పందించారు. ఆబ్కారీ ఈఎస్‌ ఆదేశాలతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సదాశివనగర్‌, మాచారెడ్డి, దోమకొండ మండలాల్లో దాడులు చేశారు. ముత్యంపేటలో ఎస్సై మమత ఆధ్వర్యంలో 20 లీటర్ల విస్కీ, ఒక కేసు బీరు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు నారాగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి డీటీఎఫ్‌ జిల్లా అధికారి రాధాకృష్ణారెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
పక్కదారి పట్టిన  రూ.8.90 లక్షలు చెల్లింపు
మద్నూర్‌, న్యూస్‌టుడే: మద్నూర్‌ సహకార సంఘం కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై గతేడాది డిసెంబరు 24న ‘ఈనాడు’లో ‘అక్రమాలకు ఊతం..రైతు రుణాలకు సంకటం’ పేరుతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల విచారణలో డబ్బులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. వారి ఆదేశాల మేరకు సంఘం ఛైర్మన్‌ తిరిగి రూ.8.90 లక్షలు చెల్లించినట్లు సంఘం కార్యదర్శి బాబురావు బుధవారం ‘న్యూస్‌టుడే’కు చరవాణిలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని