logo

కొనసాగుతున్న ఉపాధి పనుల తనిఖీ

మండలంలో కేంద్ర బృందం అధికారులు బుధవారం రెండో రోజు ఉపాధి పనుల తనిఖీ కొనసాగించారు. ఎల్లంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్‌, వంట గదులు, రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు.

Published : 20 Jan 2022 02:40 IST

గ్రామ పంచాయతీలో చేయాల్సిన పనులను కార్యదర్శులకు వివరిస్తున్న కేంద్ర అధికారుల బృందం

మాచారెడ్డి, న్యూస్‌టుడే: మండలంలో కేంద్ర బృందం అధికారులు బుధవారం రెండో రోజు ఉపాధి పనుల తనిఖీ కొనసాగించారు. ఎల్లంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్‌, వంట గదులు, రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న విషయం తెలుసా అని అధికారులు, గ్రామస్థులను అడిగారు. గ్రామ పంచాయతీ నిధులతో ఏయే పనులు చేయొచ్చు సూచించారు. పంచాయతీ కార్యాలయంలోకి  దివ్యాంగులు వచ్చేందుకు వీలుగా చక్రాల కుర్చీ ఏర్పాటు చేయాలన్నారు. రికార్డులు తనిఖీ చేశారు. అధికారులు సుమిత్‌గోస్వామి, శంకర్‌లాల్‌, ఎంపీడీవో బాలకృష్ణ, డీపీవో ప్రభాకర్‌, ఏపీడీ శ్రీకాంత్‌, డీఎల్‌పీవో సాయిబాబా, ఎంపీవో నాగరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు