logo

చిత్రవార్తలు

ఇప్పటి వరకు అంతటా కూరగాయలు, పశువుల అంగళ్లు చూసుంటారు. ద్విచక్ర వాహనాల సంత చూడాలంటే మాత్రం కామారెడ్డికి వెళ్లాల్సిందే. జిల్లాకేంద్రంలోని సీఎస్‌ఐ మైదానంలో ప్రతి గురువారం దీన్ని నిర్వహిస్తుంటారు.  200 నుంచి 300

Published : 21 Jan 2022 03:35 IST

అవునండి.. ద్విచక్ర వాహనాల అంగడి

ఇప్పటి వరకు అంతటా కూరగాయలు, పశువుల అంగళ్లు చూసుంటారు. ద్విచక్ర వాహనాల సంత చూడాలంటే మాత్రం కామారెడ్డికి వెళ్లాల్సిందే. జిల్లాకేంద్రంలోని సీఎస్‌ఐ మైదానంలో ప్రతి గురువారం దీన్ని నిర్వహిస్తుంటారు.  200 నుంచి 300 వరకు సెకండ్‌ హ్యాండ్‌ బండ్ల క్రయవిక్రయాలు జరుగుతాయి. మోడల్‌, ధర తదితర పూర్తి వివరాలు ప్రదర్శిస్తూ విక్రయిస్తుంటారు.

- ఈనాడు, నిజామాబాద్‌


వేసి.. ఎన్నాళ్లో?

కోటగిరి మండలంలో రోడ్లు శిథిలమై నరకం చూపుతున్నాయి. ఏళ్ల కిందట వేసిన తారురోడ్లు నేడు నామరూపాల్లేకుండా పోయాయి. మోకాలి లోతు గుంతలు పడి కంకర తేలాయి. కారేగాం-సుంకిని, కల్లూర్‌-కొడిచర్ల, కోటగిరి-రాంపూర్‌ మార్గాల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లేలేని దుస్థితి. కనీసం పాదచారులు వెళ్లేందుకు సాహసించడంలేదు. రాత్రివేళల్లో వెళ్లేవారు గుంతల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. కనీసం మొరంపోసి తాత్కాలిక మరమతు పనులైనా చేయాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. 

- న్యూస్‌టుడే, కోటగిరి


కలెక్టరేట్లో కట్టడి

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కట్టడి చర్యలు చేపట్టారు. ప్రధాన ద్వారంతోపాటు ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. సిబ్బందిని తప్ప ఇతరులను లోనికి అనుమతించడం లేదు. అర్జీదారుల సౌకర్యార్థం బయట ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేశారు.

- న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌


80 టైర్లతో చకచకా..

డిచ్‌పల్లి పరిధి జాతీయ రహదారిపై గురువారం 80 టైర్ల ట్రాలీపై తరలుతున్న భారీ యంత్రం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుజరాత్‌లో తయారైన దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లు లారీ చోదకుడు తెలిపారు.

- ఈనాడు, నిజామాబాద్‌


కొనితెచ్చుకోవొద్దు ముప్పు

కరోనా మొదటి, రెండో దశలో దుకాణాలు, మార్కెట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ముగ్గుతో గడులు గీసి వరుస క్రమం పాటించేలా చేసేవారు. ఇవి పాటించని దుకాణదారులకు పుర, గ్రామాధికారులు జరిమానాలు విధించారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. జనం ఎక్కడా భౌతికదూరం పాటించట్లేదు. దుకాణాల్లో శానిటైజర్‌ ఉంచడం లేదు. కామారెడ్డి అశోక్‌నగర్‌ కూరగాయల మార్కెట్లో గురువారం దేశ్‌పాండే ఫౌండేషన్‌ ప్రతినిధులు విక్రయాలు జరిగే చోట ముగ్గు వేసి అవగాహన కల్పించారు. రైతులకు మాస్కులు పంపిణీ చేశారు.

  - న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని