logo

బస్సులో పొగలు.. భయంతో ప్రయాణికులు

బస్సులోని ఇంజిన్‌ బానెట్‌ నుంచి ఒక్కసారిగా పొగలు, దుర్వాసన రావడంతో ప్రయాణికులు కేకలు వేస్తూ బయటపడిన ఘటన గురువారం భైంసా- బాసర మార్గంలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ డిపో-2కు చెందిన బస్సు రాత్రి 7 గంటల

Published : 21 Jan 2022 03:35 IST

రోడ్డుపై చీకట్లో నిల్చున్న ప్రయాణికులు

భైంసా, న్యూస్‌టుడే : బస్సులోని ఇంజిన్‌ బానెట్‌ నుంచి ఒక్కసారిగా పొగలు, దుర్వాసన రావడంతో ప్రయాణికులు కేకలు వేస్తూ బయటపడిన ఘటన గురువారం భైంసా- బాసర మార్గంలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ డిపో-2కు చెందిన బస్సు రాత్రి 7 గంటల ప్రాంతంలో సుమారు 40 మంది ప్రయాణికులతో భైంసా నుంచి నిజామాబాద్‌ బయలు దేరింది. ఈ క్రమంలో భైంసా-దేగాం మార్గమధ్యంలో రహదారిపై ఉన్న గుంతలో పడగా బానెట్‌ వద్ద విద్యుత్తు తీగలు ఒకదానికి ఒకటి అతుక్కుని పొగలు చెలరేగి బస్సులోని దీపాలు ఆరిపోయాయి. పొగ దుర్వాసనను పసిగట్టిన ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే డ్రైవరు బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు తమ పిల్లాపాపలతో కిటికీలు, ద్వారాల నుంచి కిందకు వచ్చారు. డ్రైవరు బస్సుకు మరమ్మతులు చేశారు. మార్గమధ్యలో జరిగిన ఘటన కారణంగా చీకట్లో ఆ మార్గంలో వెళ్లే వాహనాల కోసం ప్రయాణికులు సుమారు గంటపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులను సురక్షితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని