logo

చుట్టాలొచ్చారు... చట్టాలు భద్రమేనా..!

ఇటీవలి కాలంలో జిల్లాలో పెద్దఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. కానిస్టేబుల్‌ నుంచి మొదలుకొని సీఐ స్థాయి వరకు 317 జీవోకు అనుగుణంగా మార్పులు జరిగాయి. ఇందులో

Published : 21 Jan 2022 03:35 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి : ఇటీవలి కాలంలో జిల్లాలో పెద్దఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. కానిస్టేబుల్‌ నుంచి మొదలుకొని సీఐ స్థాయి వరకు 317 జీవోకు అనుగుణంగా మార్పులు జరిగాయి. ఇందులో వింతేమీ లేకున్నా.. కామారెడ్డి సబ్‌ డివిజన్‌ పరిధిలో మాత్రం ఆయా ఠాణాలకు వచ్చిన పోలీసు అధికారుల్లో చాలామందికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో బంధుత్వాలు ఉండటమే గమనార్హం. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా ఫలానా ఎస్సై తమ చుట్టరికమేనని చెప్పుకొంటున్నారు. కొందరైతే కొత్తగా వరుసలు కలిపేసుకుంటున్నారు.  
యాదృచ్ఛికమా..  సంకల్పితమా..
ఈ పోస్టింగులు పైకి యాదృచ్ఛికంగానే కనిపిస్తున్నా..  అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నవారికే అనుకున్న ఠాణాల్లో పోస్టింగు దుక్కుతోందన్న విమర్శలున్నాయి. జిల్లాకేంద్రం శివారులోని ఠాణాకు సమీప మండలానికి చెందిన వ్యాపారవేత్త బంధువే వచ్చారు. మరో మండల ఠాణాకు నామినేటెడ్‌ ప్రజాప్రతినిధి అల్లుడు బదిలీపై వచ్చారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండే ఠాణాకు ఉభయ జిల్లాలో సేవలందించిన అధికారి తనయుడు ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని