logo

పసుపు బోర్డుతోనే రైతులకు మేలు

నిజామాబాద్‌లో ఏర్పాటైన పసుపు ప్రాంతీయ కార్యాలయం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, సత్వరమే బోర్డు ఏర్పాటుకు ఎంపీ అర్వింద్‌ చొరవ చూపాలని కిసాన్‌ కేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని

Published : 21 Jan 2022 03:35 IST

సమావేశంలో మాట్లాడుతున్న అన్వేష్‌రెడ్డి, పక్కన చిన్నారెడ్డి

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లో ఏర్పాటైన పసుపు ప్రాంతీయ కార్యాలయం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, సత్వరమే బోర్డు ఏర్పాటుకు ఎంపీ అర్వింద్‌ చొరవ చూపాలని కిసాన్‌ కేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్దతు ధర కల్పిస్తేనే కర్షకులకు న్యాయం జరుగుతుందని, ఇందుకోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే సత్వరమే బోర్డు తీసుకొస్తానని నమ్మించి అర్వింద్‌ మోసం చేశారని విమర్శించారు. త్వరలోనే కిసాన్‌ కేత్‌ ఆధ్వర్యంలో పసుపు రైతులందరిని ఏకం చేసి బోర్డు సాధన కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జక్రాన్‌పల్లి మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు