logo

ఈ-వాహనాల కొనుగోలుకు రుణాలు

రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్ర్తీనిధి ద్వారా ఈ-బైక్‌, ఈ-ఆటోలను కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేస్తోందని స్ర్తీనిధి రాష్ట్ర జోనల్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు

Updated : 21 Jan 2022 19:16 IST

బీర్కూర్‌: రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్ర్తీనిధి ద్వారా ఈ-బైక్‌, ఈ-ఆటోలను కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేస్తోందని స్ర్తీనిధి రాష్ట్ర జోనల్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అర్హులైన డ్వాక్రా మహిళలకు ఈ-వాహనాలతో పాటు మండల కేంద్రాల్లో జనరిక్‌ ఔషధ దుకాణాలు, పెరటి కోళ్ల పెంపకానికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలను గుర్తించి రుణాలు మంజూరు చేయించాలని ఐకేపీ అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గంగాధర్‌ యాదవ్‌, సీసీ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని