logo

మన ఊరు- మన బడితో కొత్త కళ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో పాఠశాలలు కొత్త కళ సంతరించుకుంటాయని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం

Published : 22 Jan 2022 03:30 IST

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను సన్మానిస్తున్న పీఆర్టీయూ జిల్లా శాఖ ప్రతినిధులు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో పాఠశాలలు కొత్త కళ సంతరించుకుంటాయని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన్ను సన్మానించారు. పాఠశాలల అభివృద్ధికి రూ.7239 కోట్లు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గోవర్ధన్‌ పేరు మీద ప్రత్యేకంగా రూపొందించిన దైనందినిని అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మాణిక్యం, బాపురెడ్డి, జశ్వంత్‌రావు, కుషాల్‌  పాల్గొన్నారు.

హోమియోపతి(కరోనా) బూస్టర్‌ డోస్‌ కిట్‌ విడుదల
కామారెడ్డి అర్బన్‌: కరోనా ఒమిక్రాన్‌ వేగంగా ప్రబలుతున్న తరుణంలో హోమియోపతి ఇమ్యూనిటీ బూస్టర్‌ డోస్‌ కిట్‌ను ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో వైద్యుడు హరీశ్‌ నేతృత్వంలో దీనిని విడుదల చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, రవితేజగౌడ్‌, బాల్‌చంద్రం, కృష్ణ, రమేశ్‌, రఘుపతిరెడ్డి, బాలాగౌడ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని