logo

పక్కాగా ఇంటింటి సర్వే

ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా జరగాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. కొవిడ్‌

Published : 22 Jan 2022 03:30 IST

జానకంపేటలో సర్వే వివరాల నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా జరగాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గత రెండేళ్లలో పలు శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. మొక్కుబడిగా పనిచేస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేశారు. అనంతరం నాబార్డు తయారుచేసిన ప్రణాళికలను విడుదల చేశారు. శిక్షణ కలెక్టర్‌ మకరంద్‌, డీఎఫ్‌వో సునీల్‌ పాల్గొన్నారు.

2 బోధన్‌, ఎడపల్లి: బోధన్‌, ఎడపల్లిలో శుక్రవారం ప్రారంభమైన జ్వర సర్వే తీరును కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించి మాట్లాడారు. నిత్యం గరిష్ఠంగా 500 కేసులు నమోదవుతున్నా పరిస్థితి అదుపులో ఉందన్నారు. జిల్లా ఆస్పత్రిలో 47 మంది మాత్రమే చికిత్స కోసం చేరినట్లు చెప్పారు. టీకాలు తీసుకోవడం వల్ల వైరస్‌ ఊపిరితిత్తుల వరకు వెళ్లడం లేదన్నారు. అంతకుముందు ఆచన్‌పల్లి శివారులో మియావాకి కింద పెంచుతున్న మొక్కలను, బోధన్‌-నిజామాబాద్‌ రహదారిపై అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఆర్డీవో రాజేశ్వర్‌, ఇన్‌ఛార్జి కమిషనర్‌ శివానంద్‌, ఎడపల్లి తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో శంకర్‌, గిర్దావర్‌ గంగారెడ్డి, ఇంద్రకరణ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని