logo

‘రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించాం’

ఉద్యోగ కల్పనపై కేంద్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కమ్మర్‌పల్లిలో రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించిన క్రీడా మైదానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన

Published : 22 Jan 2022 03:30 IST

కమ్మర్‌పల్లిలో మినీస్టేడియాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: ఉద్యోగ కల్పనపై కేంద్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కమ్మర్‌పల్లిలో రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించిన క్రీడా మైదానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా రాష్ట్ర నాయకులు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ కృషితో రాష్ట్రంలో యువతకు 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. కమ్మర్‌పల్లి గ్రామస్థుల చిరకాల స్వప్నమైన స్టేడియాన్ని ఏర్పాటు చేయడం తనకు అమితమైన సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతకుముందు ఉన్నత పాఠశాలలో రూ.35 లక్షలతో చేపట్టిన అదనపు గదులు, రూ.50 లక్షలతో గ్రామంలో చేపట్టిన సీసీ మురుగుకాల్వలు, పాటి హనుమాన్‌ ఆలయంలో పిరమిడ్‌ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఎంపీపీ గౌతమి, జడ్పీటీసీ సభ్యురాలు రాధ, సర్పంచి స్వామి, ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్‌, భాస్కర్‌యాదవ్‌, రేగుంట దేవేందర్‌, బద్దం రాజశేఖర్‌, లుక్క గంగాధర్‌, సుమన్‌, రఘు, రాజాగౌడ్‌, చిన్నారెడ్డి పాల్గొన్నారు.      

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని