logo

పరీక్ష రుసుము చెల్లింపుల్లో ఆలస్యం

ఇంటర్మీడియెట్‌ పరీక్ష రుసుము చెల్లింపు తేదీ సమీపిస్తున్నా ఫీజు చెల్లిస్తున్న విద్యార్థులు 10 శాతం కూడా దాటట్లేదు. కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కళాశాల ఫీజు

Published : 22 Jan 2022 03:30 IST

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియెట్‌ పరీక్ష రుసుము చెల్లింపు తేదీ సమీపిస్తున్నా ఫీజు చెల్లిస్తున్న విద్యార్థులు 10 శాతం కూడా దాటట్లేదు. కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కళాశాల ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రుసుము తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 50 ప్రభుత్వ, 47 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు 18,823 మంది ఉంటే కేవలం 1745, ద్వితీయ సంవత్సరంలో 18,726 మందికి గాను 1053 మంది మాత్రమే పరీక్ష ఫీజులు చెల్లించినట్లుగా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంది. ‘జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పరీక్ష ఫీజులు చెల్లించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. ఈ నెల 24లోగా వంద శాతం పూర్తి చేయాలని ప్రచారం చేయిస్తున్నామని’ జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి లోకం రఘురాజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని