logo

బాలరక్ష వాహనం ప్రారంభం

కలెక్టరేట్‌ కార్యాలయంలో బాలరక్ష వాహనాన్ని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న

Published : 23 Jan 2022 04:19 IST


జెండా ఊపుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పక్కన జిల్లా ప్రజాప్రతినిధులు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ కార్యాలయంలో బాలరక్ష వాహనాన్ని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పిల్లలను కాపాడడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 33 వాహనాలను సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా కొనుగోలు చేసి జిల్లాలకు కేటాయించిందన్నారు. భిక్షాటన చేస్తున్నా, బడిబయట ఉన్నా, శారీరక హింసకు గురవుతున్నా, వసతి లేని పిల్లలు కనిపిస్తే 1098 నంబరుకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే ఈ వాహనంలో వచ్చి తీసుకెళ్తారన్నారు. కార్యక్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దాపేధార్‌ శోభ, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, సంక్షేమాధికారిణి సరస్వతి, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ సత్యనారాయణ, సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని