logo

రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం

తెరాస సర్కారు మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేందుకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచేందుకు యత్నిస్తోందని కామారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి మండలం

Published : 23 Jan 2022 04:19 IST


సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: తెరాస సర్కారు మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేందుకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచేందుకు యత్నిస్తోందని కామారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లాకేంద్రంగా మారినా విలీన గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నాయన్నారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి, నాయకులు ప్రదీప్‌, శ్రీధర్‌, ఆనంద్‌రావు, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లేశ్‌, రాజు, నవీన్‌, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని