logo

ఎరువు.. ధరల దరువు

ఇప్పటికే కష్టాలు భరిస్తూ, నష్టాలు మోస్తున్న అన్నదాతలపై మరో అదనపు భారం పడింది. మిశ్రమ ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయం రైతులకు శరాఘాతంగా మారింది.

Published : 24 Jan 2022 04:08 IST

జిల్లా రైతులపై ఏటా రూ.35 కోట్ల అదనపు భారం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి; న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌

ఇప్పటికే కష్టాలు భరిస్తూ, నష్టాలు మోస్తున్న అన్నదాతలపై మరో అదనపు భారం పడింది. మిశ్రమ ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయం రైతులకు శరాఘాతంగా మారింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న కర్షకులకు పెట్టుబడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా రైతులపై ఏటా రూ.35 కోట్ల వరకు అదనపు భారంపడనుంది.

కంపెనీలకు స్వేచ్ఛ

కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను మాత్రమే తన ఆధీనంలో ఉంచుకుంది. మిగతా వాటి నియంత్రణను తయారు చేసే కంపెనీలకే ఇచ్చేసింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా ముడిసరకులు పెరిగినప్పుడల్లా ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్‌(మిశ్రమ) ఎరువుల్లో భాస్వరం, పొటాష్‌ వంటి ఉంటాయి. డీఏపీని వరి నాటు వేసే సమయంలో దుక్కిలోనే వేస్తారు. కాంప్లెక్స్‌ ఎరువులను మొక్కలు పెరిగిన తర్వాత రెండు మూడు దఫాలుగా అందిస్తారు.

పెరుగుతున్న వాడకం

* వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి, లక్షన్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పండిస్తారు.

* రెండు సీజన్లలో కలిపి వరి ఒక్కటే నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఇందు కోసం దాదాపు 30 వేల మెట్రిక్‌ టన్నుల మిశ్రమ ఎరువులు అవసరమవుతాయి.

* ఏటేటా రసాయన ఎరువుల వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

* ముఖ్యంగా జిల్లాలో మిశ్రమ ఎరువుల వినియోగం మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది.

* మొక్కజొన్నతో పాటు ఇతర ఆరుతడి పంటలకు అధికంగావాడతారు.

* అన్నదాతలు సేంద్రియం పూర్తిగా తగ్గించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని