logo

రుణ లక్ష్యంలో బాన్సువాడ ముందంజ

మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ.. వారి ఉన్నతే లక్ష్యంగా ముందుకు సాగేందుకు స్వయం సహాయ సంఘాలు దోహదపడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల్లో జిల్లాలోనే బాన్సువాడ ముందంజలో నిలిచింది.

Published : 24 Jan 2022 04:08 IST

135 శాతంతో ప్రథమం

న్యూస్‌టుడే, బాన్సువాడ పట్టణం


ఆర్పీలు, సహాయ సంఘాల సభ్యులతో సమీక్షిస్తున్న డీఎంసీ

మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ.. వారి ఉన్నతే లక్ష్యంగా ముందుకు సాగేందుకు స్వయం సహాయ సంఘాలు దోహదపడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల్లో జిల్లాలోనే బాన్సువాడ ముందంజలో నిలిచింది.

స్థానిక పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉంటున్న పలువురు పేద మహిళలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక చేయూత దొరుకుతుందని సంఘాల్లో భాగస్వాములవుతున్నారు. 2021-22 సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం రూ.12.24 కోట్లు కాగా.. రూ. 16.10 కోట్లు పంపిణీ చేసి 135 శాతంతో జిల్లాలో బాన్సువాడ ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రత్యేక ప్రణాళిక.. మెప్మా అధికారులు, ఆర్పీలు పురపాలికకు సంభంధించిన రుణ లక్ష్యాలను వార్డుల వారీగా విభజించుకొని ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఆ ప్రకారం వారంవారం సిబ్బంది, బ్యాంకు అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సంఘాలకు రుణాలు అందించేందుకు ఆర్పీలు వారి ఏఎల్‌ఎఫ్‌ల వారిగా అతివలను ప్రోత్సహిస్తూ.. వారు అనుకున్న రంగాలు, ఆసక్తి చూపిన అంశాలపై అవగాహన కల్పించారు.

టీఎల్‌ఎఫ్‌: 1

ఏఎల్‌ఎఫ్‌లు: 19

ఆర్పీలు: 19

స్వయం సహాయక సంఘాలు: 177

మొత్తం సభ్యులు: 1,770

రుణ లక్ష్యం: రూ. 12.24 కోట్లు

పంపిణీ చేసింది: రూ. 16.10 కోట్లు

అందరి కృషితోనే సాధ్యమైంది : - శ్రీధర్‌రెడ్డి, మెప్మా డీఎంసీ

ఆర్పీలు, బ్యాంకు అధికారుల కృషితో 135 శాతం లక్ష్యం సాధించి బాన్సువాడ ముందువరుసలో నిలిచింది. ఇందుకు ఎల్‌డీఎం, అదనపు పాలనాధికారి ఎంతో చొరవ చూపారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని