logo

ఆదాయపన్ను పరిమితి పెంచాలి

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయ పరిమితిని రూ.పది లక్షలకు పెంచాలని, పింఛనర్లకు పన్ను పూర్తిగా మినహాయించాలని తెలంగాణ....

Published : 24 Jan 2022 05:28 IST


సమావేశంలో పాల్గొన్న సంఘం ప్రతినిధులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయ పరిమితిని రూ.పది లక్షలకు పెంచాలని, పింఛనర్లకు పన్ను పూర్తిగా మినహాయించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దత్తాత్రేయరావు, రాంమోహన్‌రావు డిమాండు చేశారు. ఆదివారం నగరంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జనవరి 2020 నుంచి జూన్‌ 2021 వరకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పింఛనర్లు, ఉద్యోగులకు ఉపయోగపడే సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ కేంద్రాన్ని ఇందూరులో ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఉపాధ్యక్షులు జార్జ్‌, నరసింహస్వామి, ఈవీఎల్‌ నారాయణ, అట్లూరి మురళీకృష్ణ, కార్యదర్శులు వీరయ్య, సిర్పలింగం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని