logo

కోళ్ల పరిశ్రమకు విద్యుత్తు రాయితీ

కోళ్ల పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పౌల్ట్రీ నిర్వాహకులు ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీ గోపాల్‌రావును కలిసి వారి బాధలు చెప్పుకొన్నారు.

Published : 24 Jan 2022 05:28 IST

యూనిట్‌కు రూ. 2

జిల్లాలో 403 మందికి లబ్ధి

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

కోళ్ల పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పౌల్ట్రీ నిర్వాహకులు ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీ గోపాల్‌రావును కలిసి వారి బాధలు చెప్పుకొన్నారు. ఆయన స్పందిస్తూ ఇప్పటికే ఒక్కో యూనిట్‌కు రూ.2 రాయితీ అందిస్తున్నామని వివరించారు. తమకు అలాంటిదేమీ అందడం లేదని నిర్వాహకులు చెప్పడంతో అవగాహన కల్పించి రాయితీ అందేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను సీఎండీ ఆదేశించారు. ఈ మేరకు విద్యుత్తుశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కేటగిరి మారడంతో..

* కోళ్ల పరిశ్రమలు చాలావరకు కేటగిరి- 2, 3 కింద ఉన్నాయి.

* వారికి ఒక్కో యూనిట్‌కు రూ.6.70 వరకు బిల్లు వేస్తున్నారు. ఈ సర్వీసులకు రాయితీలు వర్తించవు.

* చాలా మంది పౌల్ట్రీ యజమానులు అవగాహన లేకపోవడంతో విద్యుత్తు కనెక్షన్‌ కోసం ఈ కేటగిరిల కింద దరఖాస్తు చేసుకున్నారు.

* పైగా కోళ్ల పరిశ్రమ కోసం అని కాకుండా యజమాని పేరు మీద తీసుకున్నారు.

* విద్యుత్తు అధికారులు దరఖాస్తుల్లో పేర్కొన్నట్లుగా సర్వీసులు మంజూరు చేశారు.

* వాస్తవానికి కోళ్ల పరిశ్రమకు కేటగిరి 3లో సబ్‌ కేటగిరి 6గా ఉండాలి. దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఇలాగే చేసుకుంటే విద్యుత్తు అధికారులు అలాగే మంజూరు చేస్తారు.

* దీనివల్ల ఒక్కో యూనిట్‌కు రూ.6 నుంచి 6.70 బిల్లు వస్తుంది. అందులో రూ.2 రాయితీ లభిస్తుంది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.4 బిల్లు మాత్రమే.


అవగాహన కల్పిస్తున్న విద్యుత్తు అధికారులు

మూడు నెలల్లో..

ప్రభుత్వం ఇచ్చే రాయితీలు మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో లబ్ధిదారులకు అందజేస్తారు. ఇందు కోసం వారి కేటగిరిని మార్చుకోవాల్సి ఉంటుంది. విద్యుత్తు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేటగిరి 3, సబ్‌ కేటగిరి 6గా నమోదు చేస్తున్నారు. గతంలో మార్చుకున్నవారికి రాయితీలు వర్తిస్తున్నాయి. మూడు నెలల పాటు బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత ప్రభుత్వ రాయితీని బిల్లు కింద జమ కడతారు.

బిల్లులో కనిపించడం లేదు..

ఇప్పటికే కొందరు యజమానులు తమకు రాయితీ చెల్లింపుల వివరాలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని బిల్లులోనే తగ్గించి ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. రికార్డుల్లో మాత్రం రాయితీ వచ్చినట్లు చూపుతోంది. బిల్లులోనే కనిపించేలా ముద్రిస్తే అందరికి అర్థమవుతుంది.

సద్వినియోగం చేసుకోవాలి : - శ్రీనివాస్‌, ఎస్‌ఏవో, కామారెడ్డి

కోళ్ల పరిశ్రమ యజమానులు రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి. సర్వీసులను కేటగిరి 3, సబ్‌కేటగిరి 6 కింద మార్చుకోవాలని అవగాహన సదస్సుల్లో చెబుతున్నాం. జిల్లాలో అన్ని పౌల్ట్రీలకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని