logo

నేటి నుంచి ఆన్‌లైన్‌ బోధన

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరోసారి ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించాలని డీఈవోలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published : 24 Jan 2022 05:28 IST

8, 9, 10వ తరగతి విద్యార్థులకు..

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

ఆన్‌లైన్‌ తరగతులను పర్యవొేక్షిస్తున్న అధికారులు (దాచిన చిత్రం)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరోసారి ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించాలని డీఈవోలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేళ్లుగా తరగతుల నిర్వహణ గందరగోళంగా మారిన నేపథ్యంలో మరోసారి ఆన్‌లైన్‌ పాఠాలకు మొగ్గుచూపడం తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గాడిలో పడుతుండగా..

జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 178 ఉండగా సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. గతేడాది సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. చదువులు గాడిలో పడుతున్న వేళ ఊహించని విధంగా మళ్లీ కొవిడ్‌ ముంచుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో 84 పని దినాల్లోనే బడులు కొనసాగాయి. పాఠ్యప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు. ఇది వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతులపై పర్యవేక్షణ లేకపోవడంతో హాజరు 50 శాతానికి మించలేదు. సాంకేతిక సమస్యలతో విద్యార్థులు చదువులపై శ్రద్ధ చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మరింత తీవ్ర స్థాయిలో ఉంది.

సందిగ్ధం.. ప్రాథమికం

జిల్లాలో 1- 7 తరగతులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. వీరికి పాఠాలు బోధించడంపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించగా 17న పునఃప్రారంభించాల్సి ఉంది. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించారు.

మొత్తం విద్యార్థులు 1.23 లక్షలు

8 - 10 తరగతులు 32,313

1 - 7 90,687

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని