logo

అతివలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సూచించారు. దోమకొండలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.

Published : 25 Jan 2022 03:12 IST

ట్రాక్టర్‌ అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

దోమకొండ, న్యూస్‌టుడే: మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సూచించారు. దోమకొండలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా రైతు సంఘానికి మంజూరైన ట్రాక్టర్‌తోపాటు పరికరాలు అందజేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపుతో పాటు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగటం అభినందనీయమన్నారు. అనంతరం రైతుబంధు సమితి కాలమానిని ఆవిష్కరించారు. ఎంపీపీ సదానంద, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ కుంచాల శేఖర్‌, సర్పంచి అంజలి, వైస్‌ ఎంపీపీ బాపురెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, ఏవో పవన్‌కుమార్‌, ఏపీఎం రాజు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని