logo

బాలికలు ఎదగడానికి ప్రోత్సహించాలి

బాలికలు అన్ని రంగాల్లో ఎదగడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సోమవారం

Published : 25 Jan 2022 03:12 IST

ప్రశంసా పత్రాలు అందుకున్నఅమ్మాయిలతో పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బాలికలు అన్ని రంగాల్లో ఎదగడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బాల్యం నుంచే ప్రణాళికబద్ధంగా చదువుకుని లక్ష్యాన్ని సాధించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారిణి సరస్వతి మాట్లాడుతూ.. అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం బాలికల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించినవారికి ధ్రువపత్రాలు అందజేశారు. గిరిజన అభివవృద్ధి అధికారి అంబాజీ, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్‌, డీఈవో రాజు, జిల్లా బాలికల సంరక్షణ అధికారి స్రవంతి, బాల రక్షాభవన్‌ సమన్వయకర్త జానకి, చైల్డ్‌ వెల్పేర్‌ సభ్యురాలు స్వర్ణలత పాల్గొన్నారు.

దళితబంధు అర్హులను గుర్తించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌: గ్రామాల వారీగా దళితబంధు అర్హులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీసీలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేసిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు 25వ తేదీలోగా లబ్ధిదారులను గుర్తించి, పంపించాలని ఆదేశించారు. జ్వరం సర్వేను వేగంగా చేపట్టి లక్షణాలు ఉన్నవారి వివరాలను తెలియజేయాలన్నారు. ఉపాధిహామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, డీఆర్డీవో వెంకటమాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, ఏపీడీ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన.. కామారెడ్డి కలెక్టరేట్‌: గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి జితేస్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జాతీయ జెండా ఎగుర వేయు స్థలాన్ని చూశారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఈసారి కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏవో రవీందర్‌ ఉన్నారు.

రిజిస్ట్రేషన్‌ రుసుములు తిరిగి చెల్లిస్తాం

కామారెడ్డి కలెక్టరేట్‌: రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ రుసుమును దరఖాస్తుదారులకు తిరిగి చెల్లిస్తున్నామని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం తెలిపారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో ఈ నెల 28లోపు కలెక్టరేట్‌లోని హెచ్‌ సెక్షన్‌లో కలవాలని సూచించారు. ఈ సేవ రసీదు, ఆధార్‌, బ్యాంకు పాస్‌ పుస్తకం, పాన్‌కార్డు, జిరాక్స్‌ ప్రతులతో దరఖాస్తు చేసినవారికి రుసుము తిరిగి చెల్లిస్తామన్నారు. పూర్తి వివరాలకు 08468-220069కు కాల్‌ చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని