logo

‘రాష్ట్రంలో భాజపాదే అధికారం’

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా భాజపా అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారని, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సోమవారం మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలో

Published : 25 Jan 2022 03:12 IST

నర్సింగ్‌పల్లిలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

బోర్గాం(పి)(మోపాల్‌), న్యూస్‌టుడే: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా భాజపా అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారని, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సోమవారం మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడేళ్ల తెరాస పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. కార్యకర్తల కృషి వల్లే పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండి విజయానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. భాజపా జిల్లాధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య, బీజేవైఎం జిల్లాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రవికుమార్‌ పాల్గొన్నారు.

డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించాలి

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నందున డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించాలని ఎంపీ అర్వింద్‌ డిమాండు చేశారు. అవసరమైతే సొసైటీ ఆస్తులు అమ్మి నగదు ఇవ్వాలన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డితో సమావేశమైన అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌లో పంచాయతీ అనుమతి లేకుండానే ఓ ప్రార్థన మందిరం నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నాగారంలో ఇళ్ల స్థలాల కబ్జాపై విచారణ చేపట్టి పట్టాలు ఉన్న వారికి న్యాయం చేయాలన్నారు. భీమ్‌గల్‌ మండలంలో ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించే విషయమై కలెక్టర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని