logo

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైనది

ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే అని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు....

Updated : 25 Jan 2022 16:16 IST

బీర్కూర్‌: ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే అని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్‌ఈవో కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. రెండు రోజుల క్రితం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన పది మంది విజేతలకు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కో-ఆప్షన్‌ అరీఫ్, ఎంపీటీసీ సభ్యుడు సందీప్‌, పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని