logo

జీవన్‌రెడ్డికి తెరాస జిల్లా బాధ్యతలు

ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా, ప్రభుత్వరంగ సంస్థల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆశన్నగారి జీవన్‌రెడ్డికి తెరాస అధిష్ఠానం మరో బాధ్యత అప్పగించింది. ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా

Published : 27 Jan 2022 05:05 IST

తెరాస జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హైదరాబాద్‌లో

అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, నిజామాబాద్‌: ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా, ప్రభుత్వరంగ సంస్థల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆశన్నగారి జీవన్‌రెడ్డికి తెరాస అధిష్ఠానం మరో బాధ్యత అప్పగించింది. ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. వరుసగా రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో తొలినాటి నుంచి కొనసాగుతున్న ఈయన, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు తెరాస యువజన విభాగానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగారు. 2013లో ఉద్యమం జోరుగా సాగుతున్న సందర్భంలో జిల్లాకు వచ్చిన కేసీఆర్‌, జీవన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అంటూ ముందస్తుగా ప్రకటించారు. ఆ మేరకు జిల్లాలో మొదటి సీటు ఆర్మూర్‌ నుంచే ఖాయం చేశారు.

పార్టీ బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. సహచర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తాను. త్వరలోనే పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిపిస్తాం. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తాం. నా నియామకంలో సహకరించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని