logo

మౌనం సంపూర్ణాంగీకారమా..?

ఇటీవల కాలంలో జిల్లాలో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. బాధ్యతల ఒత్తిడితో నిర్లక్ష్యంగా

Published : 27 Jan 2022 05:05 IST

అక్రమాలపై పెదవి విప్పని అధికార యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఇటీవల కాలంలో జిల్లాలో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. బాధ్యతల ఒత్తిడితో నిర్లక్ష్యంగా ఉంటున్నారా..అక్రమాలకు పరోక్ష సహకారం అందిస్తున్నారాతెలియడం లేదని విమర్శిస్తున్నారు.

అదుపు లేదు

సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేయడంతోపాటు అధికార పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించింది. పాలన క్షేత్రస్థాయికి వచ్చినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు.

కలెక్టర్‌ దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తలు

క్షేత్రస్థాయిలో బహిర్గతమైన అవినీతి, అక్రమాల గురించి ఆయా శాఖల అధికారులు పాలనాధికారికి నివేదించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం పలు శాఖల అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వాటిపై స్పందించకపోవడాన్ని గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. అవినీతి, అక్రమాలకు తావులేకుండా నడుచుకోవాలని పలు సమావేశాల్లో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను హెచ్చరిస్తున్నా మార్పురాకపోవడం గమనార్హం. దీనికి అడ్డుకట్ట పడకపోతే భవిష్యత్తులో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు