logo

మిల్లర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

నందిపేట్‌ శివారులో బుధవారం రాత్రి సిమెంటు కలిపే మిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో దత్తాపూర్‌కు చెందిన రాజేశ్వర్‌(32) మృతి చెందారు. గ్రామం నుంచి మండలకేంద్రానికి వస్తుండగా

Published : 27 Jan 2022 05:05 IST

నందిపేట్‌, న్యూస్‌టుడే: నందిపేట్‌ శివారులో బుధవారం రాత్రి సిమెంటు కలిపే మిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో దత్తాపూర్‌కు చెందిన రాజేశ్వర్‌(32) మృతి చెందారు. గ్రామం నుంచి మండలకేంద్రానికి వస్తుండగా ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


విద్యార్థిపై కత్తితో దాడి.. నాందేడ్‌, న్యూస్‌టుడే: స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న పాటి గొడవతో ఒకరిపై కత్తితో దాడిచేసిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. హింగోళి తాలుకా కేంద్రంలో కరన్‌కు తోటి స్నేహితులు అభయ్‌ చవాన్‌, పృథ్వీరాజ్‌, సందీప్‌ మద్య గొడవ జరిగింది. ఈక్రమంలో కరన్‌ను కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడిని నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


మాంసం విక్రయిస్తున్న వ్యాపారి అరెస్టు.. నవీపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని మార్కెట్‌ స్థలంలో పశు మాంసం విక్రయిస్తున్న దర్యాపూర్‌కు చెందిన వ్యాపారి ఖురేషి ఇమామ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై పెంటాగౌడ్‌ తెలిపారు. బుధవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న 8 కిలోల మాంసాన్ని ఊరి బయట కాల్చేశామన్నారు.


పోలీసుల అదుపులో మహారాష్ట్ర ముఠా.. నిజామాబాద్‌ నేరవార్తలు: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను కమిషనరేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. ఇటీవల నిజామాబాద్‌ రూరల్‌ ఠాణా పరిధిలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. తాజాగా వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

రెంజల్‌, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన ఒకరిని రెంజల్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఓ యువకుడు దొంగిలించి నవీపేట వైపు వెళ్తుండగా బుధవారం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా తమ అదుపులో ఎవరూ లేరని తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని