logo

భాజపా నాయకుల ధర్నా

నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని...

Published : 27 Jan 2022 15:11 IST

కామారెడ్డి పట్టణం: నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భాజపా నేతలు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఒక ఎంపీపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కనుసైగల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నందిపేటకు వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జిల్లా కేంద్రం శివారులో కలిశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరమణారెడ్డి, శీను, శ్రీనివాస్‌, రాము, బాపిరెడ్డి, లక్ష్మారెడ్డి, విపుల్‌, కౌన్సిలర్లు ప్రవీణ్‌, శ్రీనివాస్‌, సరోజ, నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని