logo

స్లాట్లు దొరకట్లే..

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల పెంపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే 40 శాతం అదనంగా దస్తావేజులు జరుగుతున్నాయి. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌

Published : 28 Jan 2022 03:23 IST

భారీగా రిజిస్ట్రేషన్లు

మార్కెట్‌ విలువల పెంపు నేపథ్యంలో..

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల పెంపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే 40 శాతం అదనంగా దస్తావేజులు జరుగుతున్నాయి. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీటి సందడి నెలకొంది. పలు కార్యాలయాల్లో నెలాఖరు వరకు స్లాట్లు కూడా అందుబాటులో లేవు.

సర్కారు ఆదాయం పెంచుకొనేందుకు వీలుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను మరోమారు పెంచేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త విలువలు అమల్లోకి వస్తాయనే ప్రచారంతో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు తాకిడి పెరిగింది. ఒక్కోచోట రోజుకి 60 లోపు దస్తావేజులు జరగాల్సింది.. గత రెండ్రోజులుగా 90కి పైగా ఉంటున్నాయి. ఒక్కసారిగా దస్తావేజులు పోటెత్తడంతో సర్వర్‌ సమస్య కూడా ఏర్పడుతోంది.

రోజుకు రూ. కోటిపైనే..

ఉభయ జిల్లాల్లో పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిల్లో నిత్యం 500 పైచిలుకు దస్తావేజులు జరుగుతున్నాయి. సగటున రోజుకి రూ.60 లక్షల పైబడి ఆదాయం సమకూరుతోంది. మరోవైపు ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో మరో రూ.20 లక్షల ఆదాయం వస్తోంది. నాలా, స్టాంపుల రుసుముల ద్వారా అదనంగా రూ.20 లక్షలు వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మార్కెట్‌ విలువలు పెరిగితే రోజువారీ ఆదాయం మరో రూ.50 లక్షల వరకు పెరిగే ఆస్కారముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని