logo

పీల్చి పిప్పి చేస్తోంది

జొన్న పంటపై రసం పీల్చే పురుగు జిల్లా రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆకులపై చేరి రసం పీల్చేయడంతో పంట మొత్తం నాశనమవుతోంది. దీంతో దిగుబడిపై ప్రభావం

Published : 28 Jan 2022 03:23 IST

మోర్తాడ్‌లో సాగవుతున్న జొన్న పంట

మోర్తాడ్‌, న్యూస్‌టుడే: జొన్న పంటపై రసం పీల్చే పురుగు జిల్లా రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆకులపై చేరి రసం పీల్చేయడంతో పంట మొత్తం నాశనమవుతోంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పురుగు పంటంతా పాడు చేయకముందే నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 వేల ఎకరాల్లో జొన్న పంట వేశారు. గత కొన్నాళ్లుగా తెల్లవారుజామున కురుస్తున్న మంచు ప్రభావం కారణంగా తెగుళ్ల వ్యాప్తి అధికమవుతోంది. ప్రస్తుతం జొన్న గింజ గట్టిపడే దశలో ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెగులు సోకిన కంకుల గింజల నుంచి తియ్యటి తిగురులాంటి ద్రవం కారుతోంది. పురుగు ఆకుల రసం పీలుస్తుండటంతో అవి ఎండిపోతున్నాయి. అధిక చలి, ఆకాశం మేఘావృతమై ఉంటుండటంతో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది.

జొన్న ఆకులపై తెల్లగా కనిపించేవి రసం పీల్చే పురుగు

వాతావరణ మార్పుల వల్లే

వాతావరణ మార్పుల వల్లే రసం పీల్చే పురుగు ఉద్ధృతి కనిపిస్తోంది. దీనిని నివారించాలంటే ఎసిఫేట్‌ గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదంటే మోనోక్రోటోపాస్‌ 1.6 మి.లీ లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి చల్లుకుంటే పురుగు ఉద్ధృతి తగ్గుతుంది.

- మల్లయ్య ఏడీఏ, భీమ్‌గల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని