logo

వివాహిత ఆత్మహత్య

రెడ్డిపేటలో వివాహిత జాదవ్‌ దివ్య(22) గురువారం ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భువనేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు

Published : 28 Jan 2022 03:23 IST

రామారెడ్డి, న్యూస్‌టుడే: రెడ్డిపేటలో వివాహిత జాదవ్‌ దివ్య(22) గురువారం ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భువనేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన శ్రవణ్‌, అతని భార్య దివ్య కలిసి రెడ్డిపేటకు చెందిన లింబయ్య కోళ్లఫారంలో ఐదు నెలలుగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవల కారణంగా ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆమెకు 22 నెలల పాప ఉందని, తండ్రి రాఠోడ్‌ అర్జున్‌ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పిట్లం: మద్దెల్‌చెరువుకు చెందిన గొల్ల సాయిలు(45) మానసిక స్థితి బాగాలేక, కుటుంబ సమస్యలతో గురువారం ఇంటి వద్ద ఉరేసుకుని మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రి తరలించారు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


వాహన చోదకులకు జరిమానా

బీర్కూర్‌: మండల కేంద్రంలోని మంజీరా వారధికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు, సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపిస్తున్న 32 మంది చోదకులకు రూ.5,420, జరిమానా విధించినట్లు ఇన్‌ఛార్జి ఎస్సై రాములు తెలిపారు.


పోలీసుల అదుపులో అనుమానితుడు..!

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాల దొంగగా భావిస్తున్న ఓ అనుమానితున్ని పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతని వద్ద నుంచి మూడు రోజుల క్రితం విద్యానగర్‌ కాలనీలో దొంగతనానికి గురైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా మరిన్ని వాహనాలను దొంగిలించినట్లు దర్యాప్తులో తేలడంతో ఆరా తీస్తున్నట్లు వినికిడి.


ప్రహరీ ధ్వంసంపై ఫిర్యాదు

కామారెడ్డి నేరవిభాగం: తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ప్రహరీని ధ్వంసం చేసిన వారిపై దేవునిపల్లి పోలీసులకు ఓంప్రకాశ్‌ అనే వ్యక్తి గురువారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని