logo

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంట పొలాల్లో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి

Updated : 28 Jan 2022 18:57 IST

బీర్కూర్‌: కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంట పొలాల్లో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బిచ్కుంద సీఐ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శివాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభాకార్యానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుగుప్రయాణంలో కారులో బిచ్కుందకు వెళ్తుండగా బీర్కూర్‌ శివారులోని మంజీర నదికి వెళ్లే ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పింది. పంటపొలాల్లోకి దూసుకెళ్లి 11కేవీ విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. స్తంభం విరిగి కారుపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న హోంగార్డు శివాజీ తల్లి గంగవ్వ, భార్య పుష్ప, పిల్లలు భావన, భార్గవి, భానుతేజలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని బీర్కూర్‌ పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అనంతరం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు