logo

వ్యాక్సినేషన్‌ తీరు పరిశీలన

మండలంలోని వీరాపూర్‌ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు

Updated : 28 Jan 2022 18:55 IST

బీర్కూర్‌: మండలంలోని వీరాపూర్‌ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు తీరును తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి మొదటి, రెండో డోసులు ఎంత మంది తీసుకున్నారని ఆరా తీశారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వాళ్లను గుర్తించి వారికి టీకాలు ఇవ్వాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి షోయబ్‌ ఖాన్‌, ఆరోగ్య కార్యకర్త శిరీష, ఆశా కార్యకర్త విజయ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని