logo

స్నూకర్‌.. ఫికర్‌

స్నూకర్‌ సరదా కోసం ఆడే ఓ ఆట. దీన్ని సైతం కొందరు బెట్టింగ్‌ ఆటగా మార్చేశారు. ఇందుకోసం అడ్డాలు తెరిచి రోజుకు రూ.లక్షల్లో ధారపోస్తున్నారు. నిజామాబాద్‌ నగరంలో ఇప్పుడిప్పుడే మొదలైన ఈ స్నూకర్‌

Published : 29 Jan 2022 04:11 IST

నగరంలో బెట్టింగ్‌ అడ్డాలు

నిజామాబాద్‌లోని ఓ స్నూకర్‌ కేంద్రం

న్యూస్‌టుడే-నిజామాబాద్‌ నేరవార్తలు : స్నూకర్‌ సరదా కోసం ఆడే ఓ ఆట. దీన్ని సైతం కొందరు బెట్టింగ్‌ ఆటగా మార్చేశారు. ఇందుకోసం అడ్డాలు తెరిచి రోజుకు రూ.లక్షల్లో ధారపోస్తున్నారు. నిజామాబాద్‌ నగరంలో ఇప్పుడిప్పుడే మొదలైన ఈ స్నూకర్‌ సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా కమిషనరేట్‌ పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

రూ.లక్షల్లో చేతులు మారుతూ..
స్నూకర్‌లో సైతం క్యారంబోర్డు తరహాలో ప్రతి ఆటకు బెట్టింగ్‌ పెడుతున్నారు. ఒక్కో ఆటపై రూ.5 వేల నుంచి రూ.20 వేలకు కాస్తున్నారు. ఒక్కో చోట ఐదారు బోర్డులు ఏర్పాటు చేశారు. రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఒకటో ఠాణా పరిధిలోని ఓ కేంద్రంపై పోలీసులు ఇటీవల దాడి చేశారు. పలువురిని అరెస్టు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా యువతలో మార్పు రావట్లేదు. తిరిగి రహస్యంగా అడ్డాలు తెరిచారు. మిర్చికంపౌండ్‌, ఆర్యనగర్‌, మాలపల్లిలో అడ్డాలు తెరిచారు. యువతను ఆకర్షించేలా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బోధన్‌ రోడ్డులో ఏర్పాటైన పలు కేంద్రాలు రాత్రి 8 నుంచి వేకువజామున వరకు తెరిచి ఉంటున్నాయి. గంజ్‌లోనూ ఇటీవల మొదలుపెట్టారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ చదువుతున్న యువత ఇటువైపు ఆసక్తి చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సీపీ నాగరాజు ఇప్పటికైనా దృష్టిసారించి వీటిపై దాడులు చేయించాల్సిన అవసరం ఉంది. టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని బలోపేతం చేసి వారికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తేనే అడ్డుకట్ట పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని