logo

..అందుకే వద్దనేది!

రోజురోజుకు సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోవడం.. శస్త్రచికిత్సలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి తల్లి, బిడ్డకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరువురికీ ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని  

Published : 20 May 2022 03:05 IST

న్యూస్‌టుడే నిజామాబాద్‌ వైద్యవిభాగం

రోజురోజుకు సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోవడం.. శస్త్రచికిత్సలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి తల్లి, బిడ్డకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరువురికీ ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని  నెలరోజులుగా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వాటితో ఏర్పడే మంచి చెడులను ప్రభుత్వ వైద్యకళాశాల సహ ఆచార్య, స్త్రీవైద్య నిపుణురాలు అనుపమ వివరిస్తున్నారు.


శస్త్రచికిత్స

* జన్మించిన శిశువుకి చురుకుదనం తక్కువ
* సిరల్లో రక్తం గడ్డకట్టడంతో తల్లికి హానికరం

* బిడ్డకు గోడ్డెన్‌ హవర్‌లో ముర్రుపాలు తాగించడం కుదరదు
* గర్భాశయ గోడకు నష్టం కలుగుతుంది
* వారం రోజులు ఆసుపత్రిలో ఉండాలి
* మూడు నెలల వరకు రోజువారి పని చేసుకోవడానికి వీలుపడదు
* ఆపరేషన్‌ సమయంలో ఇచ్చే మత్తు సూది వల్ల జీవితకాలం నడుమునొప్పి ఉంటుంది
* మొదటి కాన్పు ఆపరేషన్‌ చేయించుకుంటే రెండోదానికి అదే పరిస్థితి ఉంటుంది
* బిడ్డ అరగంటలోపు ముర్రుపాలు తాగక రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది
* బిడ్డ ఊపిరితిత్తుల్లోంచి ఉమ్మనీరు పైపువేసి తీయాల్సి ఉంటుంది
* రెండో కాన్పు సమయంలో కొందరికి పొట్ట లోపల అవయవాలు అతుక్కుపోతాయి
* ఆపరేషన్‌ తర్వాత విపరీతమైన బరువు పెరడంతోపాటు లావు అవుతారు
* కొందరికి కుట్లనొప్పులు ఇబ్బందిపెడతాయి
* ఆపరేషన్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది


 సాధారణం

* చురుకుదనం ఎక్కువ
* చాలా అరుదు
* నిర్ణీత సమయంలోనే ఇవ్వొచ్చు
* ఆ సమస్య ఉండదు
* రెండు రోజుల్లో ఇంటికి వెళ్లొచ్చు
* వారం తరువాత రోజువారి పని చేసుకోవచ్చు
* నడుమునొప్పికి అవకాశం లేదు
* ఎన్ని కాన్పులకైనా ఇబ్బంది ఉండదు
* వెంటనే తాగించే అవకాశం ఉన్నందున శిశువుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువ
* ఒత్తిడితో దానంతట అదే బయటకు వెళ్లిపోతుంది
* ఆ సమస్య రాదు
* సాధారణ కాన్పులో ఈ సమస్య ఉండదు
* ఆ పరిస్థితి ఉండదు
* ఇక్కడ రక్తహీనత సమస్య రాదు


ముహూర్తం కోత ప్రమాదకరం

మూఢ నమ్మకాలతో ముహూర్తం చూసుకొని ఆపరేషన్‌ చేయించి బిడ్డను కనడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల బిడ్డకు దీర్ఘకాలంగా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి కాన్పు సమయంలో కొద్దిగా నొప్పులు భరిస్తే జీవిత కాలం ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

- అనుపమ, స్త్రీవైద్యనిపుణురాలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని