logo

హరితహారం పడట్లే

హరితహారం లక్ష్యం తగ్గింది. గతేడాది జిల్లావ్యాప్తంగా 59,20,444 మొక్కలు నాటాలని నిర్దేశించగా.. ఈసారి 45,31,238కు పరిమితం అయ్యారు. వీటిని నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా కేటాయించారు. ఈసారి వర్షాలు తొందరగానే కురిసే అవకాశం ఉన్నందున మొక్కలు నాటేందుకు

Published : 20 May 2022 03:10 IST

శాఖల వారీగా కేటాయింపు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

హరితహారం లక్ష్యం తగ్గింది. గతేడాది జిల్లావ్యాప్తంగా 59,20,444 మొక్కలు నాటాలని నిర్దేశించగా.. ఈసారి 45,31,238కు పరిమితం అయ్యారు. వీటిని నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా కేటాయించారు. ఈసారి వర్షాలు తొందరగానే కురిసే అవకాశం ఉన్నందున మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు స్థలాన్వేషణలో ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున నాటనున్నారు. ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కామారెడ్డి నుంచి డిచ్‌పల్లి, ఆర్మూర్‌ మీదుగా నిర్మల్‌ జిల్లాకు వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షణీయంగా నాటాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పంచాయతీ నర్సరీల్లో..

జిల్లావ్యాప్తంగా 530 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి మొక్కలు అవసరం ఉంటాయో గ్రామ కార్యదర్శులు తెలుసుకొని అందుకు అనుగుణంగా పెంచుతున్నారు. పండ్లు, పువ్వులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉపాధి హామీ కూలీలు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ఉపాధి కూలీలతో..

జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటుతాం. మండలాలు, శాఖల వారీగా లక్ష్యం విధించాం. ఉపాధిహామీ కూలీలతో నాటేందుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం.

- సంజీవ్‌ కుమార్‌, ఏడీపీ, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని