logo

హిందూ ఐక్యతా ప్రదర్శన

హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ నిజామాబాద్‌ నగరంలో గురువారం హిందూ జనజాగృతి సమితి ఇందూరుశాఖ, ఆర్యసమాజ్‌, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఐక్యతా ప్రదర్శన చేపట్టారు. భారత్‌మాతాకీ జై..

Published : 20 May 2022 03:10 IST

దేశభక్తులు, మహనీయుల వేషధారణలో చిన్నారులు

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ నిజామాబాద్‌ నగరంలో గురువారం హిందూ జనజాగృతి సమితి ఇందూరుశాఖ, ఆర్యసమాజ్‌, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఐక్యతా ప్రదర్శన చేపట్టారు. భారత్‌మాతాకీ జై.. అంటూ నినాదాలు చేశారు. ఆర్‌ఆర్‌ చౌరస్తా నుంచి పెద్దబజార్‌, కస్బాగల్లీ, జెండాగల్లీ, గోల్‌హనుమాన్‌ వరకు ఊరేగింపుగా సాగారు. దేశభక్తులు, మహనీయుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. నందిపేట్‌ కేదారేశ్వరాలయం వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్‌, శివానందస్వామి, ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

బోనాలతో మహిళల ఊరేగింపు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని