logo

పది పరీక్షలపై సందేహాలా.. నివృత్తి చేసుకోండి

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సందేహాలా..? ఎంత చదివినా ఆత్మస్థైర్యం లోపిస్తోందా..? అధిక మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి..?  ఏ అంశాలపై పట్టు పెంచుకోవాలి..? వంటి వాటిపై  డీఈవో రాజుతో ‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌ నిర్వహించనుంది. కొవిడ్‌ కారణంగా

Published : 20 May 2022 03:10 IST

 నేడు డీఈవోతో ‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల నిర్వహణపై సందేహాలా..? ఎంత చదివినా ఆత్మస్థైర్యం లోపిస్తోందా..? అధిక మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి..?  ఏ అంశాలపై పట్టు పెంచుకోవాలి..? వంటి వాటిపై  డీఈవో రాజుతో ‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌ నిర్వహించనుంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా పదో తరగతి చదువులు సక్రమంగా కొనసాగడం లేదు. ఈసారి కేసులు తగ్గడంతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 23 నుంచి పరీక్షలు జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలను ఒక్క ఫోన్‌కాల్‌తో నివృత్తి చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు