logo

ఈ నెల 21 నుంచి కాంగ్రెస్‌ రచ్చబండ

వరంగల్‌ రైతు సంఘర్షణ సభ తీర్మానాలను ఈ నెల 21 నుంచి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకు చేర్చాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో గురువారం కామారెడ్డి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన

Updated : 20 May 2022 03:22 IST

రైతు డిక్లరేషన్‌ ప్రతులు విడుదల చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ

కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే: వరంగల్‌ రైతు సంఘర్షణ సభ తీర్మానాలను ఈ నెల 21 నుంచి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకు చేర్చాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో గురువారం కామారెడ్డి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కార్యక్రమం కింద కౌలు రైతులతో కలిపి ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌ రద్దు చేసి నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి తెస్తామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త సుభాష్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని