logo

దళితబంధుతో ఆర్థిక స్వావలంబన

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు.

Updated : 20 May 2022 20:02 IST

బీర్కూర్‌: దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. బీర్కూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌ అనే యువకుడికి దళితబంధు పథకం కింద రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందని తెలిపారు. దళితుల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, ఏఎంసీ ఛైర్మన్‌ అశోక్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌, తెరాస మండలాధ్యక్షుడు వీరేశం, ఎంపీటీసీ సందీప్‌, తెరాస నాయకులు గంగాధర్‌, లాయక్‌, లింగం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని