logo

రైతు డిక్లరేషన్‌ అమలు చేస్తాం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని మాజీ ప్రభుత్వ విప్‌ అనిల్‌ ఈరవత్రి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని

Published : 22 May 2022 06:18 IST


ఉప్లూర్‌తో మాట్లాడుతున్న అనిల్‌ ఈరవత్రి, చిత్రంలో మానాల మోహన్‌రెడ్డి

కమ్మర్‌పల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని మాజీ ప్రభుత్వ విప్‌ అనిల్‌ ఈరవత్రి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కౌలు రైతులకు సైతం రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో కర్షకులకు డిక్లరేషన్‌ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు భాగ్య, రవి, తిప్పిరెడ్డి శ్రీను, బుచ్చి మల్లయ్య, రాజేంద్ర ప్రసాద్‌, తిరుపతిరెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని