logo

ఇద్దరు ఏపీవోల సస్పెన్షన్‌

ఉపాధిహామీ పనులకు సంబంధించిన దస్త్రాల్లో కేవలం 50 శాతం మాత్రమే సమర్పించినందుకు ఏపీవోలు మంజుల, ఓంకార్‌ను(వీరు గతంలో డిచ్‌పల్లిలో పనిచేశారు) సస్పెండ్‌ చేసినట్లు డీఆర్డీవో చందర్‌నాయక్‌ తెలిపారు.

Published : 22 May 2022 06:18 IST


దస్త్రాలు పరిశీలిస్తున్న డీఆర్డీవో చందర్‌నాయక్‌, ఎంపీపీ భూమన్న

డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పనులకు సంబంధించిన దస్త్రాల్లో కేవలం 50 శాతం మాత్రమే సమర్పించినందుకు ఏపీవోలు మంజుల, ఓంకార్‌ను(వీరు గతంలో డిచ్‌పల్లిలో పనిచేశారు) సస్పెండ్‌ చేసినట్లు డీఆర్డీవో చందర్‌నాయక్‌ తెలిపారు. డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఉపాధిహామీ పనులపై ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ గద్దె భూమన్న, ఎంపీడీవో నాగేంద్రప్ప, సహాయ విజిలెన్స్‌ అధికారి నారాయణ, రాష్ట్ర రీసోర్స్‌ పర్సన్లు అశోక్‌, దత్తు సమక్షంలో దస్త్రాలు పరిశీలించారు. డీఆర్డీవో చందర్‌ మాట్లాడుతూ.. మండలంలో 34 గ్రామ పంచాయతీల్లో 2019 - 2022 మార్చి 31 వరకు ఉపాధి హామీ కింద రూ.16.74 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. నడిపల్లి పరిధిలో దీనికి సంబంధించిన దస్త్రాలను కేవలం 50 శాతం మాత్రమే సమర్పించారని గుర్తుచేశారు. మిగతావి పంపాలని నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. తొలిరోజు ఏడు గ్రామాల దస్త్రాలను పరిశీలించారు. ఆదివారం సైతం ప్రజావేదిక కొనసాగుతుందని డీఆర్డీవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు