logo

ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక వసతులు

ధరణి టౌన్‌షిప్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ధరణి ప్రీబిడ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్లూర్‌ శివారులో ఏర్పాటు చేసిన టౌన్‌షిప్‌కు

Published : 22 May 2022 06:34 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ధరణి టౌన్‌షిప్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ధరణి ప్రీబిడ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్లూర్‌ శివారులో ఏర్పాటు చేసిన టౌన్‌షిప్‌కు డీటీసీపీ అనుమతులు ఉన్నాయన్నారు. విద్యుత్తు సౌకర్యం, రోడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొనుగోలు చేసిన ప్లాట్లకు, ఇళ్లకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవో శ్రీను, ఎల్‌డీఎం రమేశ్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

లారీల కొరతతో ఇబ్బందులు.. కామారెడ్డి కలెక్టరేట్‌: ధాన్యం కొనుగోళ్లలో లారీల కొరత లేకుండా చూడాలని తెజస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్‌, జిల్లా కన్వీనర్‌ లక్ష్మణ్‌ యాదవ్‌ శనివారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. చాకలి కుమార్‌, అమృత వర్షిత్‌, బోయిని రాజు, రామకృష్ణగౌడ్‌, సాయిలు పాల్గొన్నారు.

రుణాలు పొందేలా చర్యలు.. కామారెడ్డి కలెక్టరేట్‌: మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పొందాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఐకేపీ, మెప్మా అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన మేరకు రుణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడిపరిశ్రమ, బిస్కెట్లు, చాక్లెట్ల తయారీ, చేపల పెంపకం వంటివి చేపట్టాలన్నారు. డీఆర్డీవో సాయన్న, స్త్రీనిధి జోనల్‌ మేనేజర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని